బడ్జెట్​ లో దక్షిణాది రాష్ట్రాలకు కేంద్రం భారీ కేటాయింపులు..

కలం, వెబ్​ డెస్క్​ : కేంద్ర బడ్జెట్ (Union Budget) ప్రసంగంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతా రామన్ భారత తూర్పు, పశ్చిమ తీరాలను కలుపుతూ భారీ ‘రేర్ ఎర్త్​ అండ్ క్రిటికల్​ మినరల్​ కారిడార్​’ (Rare Earth & Critical Mineral Corridor) ఏర్పాటు గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, ఒడిశా రాష్ట్రాలను కలుపుతూ ఈ ప్రాజెక్ట్ చేపట్టనున్నారు. ఈ కారిడార్ ప్రధానంగా సముద్ర తీరంలోని సముద్ర తీరం ఇసుక ఖనిజాలపై ఆధారపడి ఉంటుంది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శ్రీకాకుళం నుండి నెల్లూరు వరకు ఉన్న తీరప్రాంతాన్ని ‘మైనింగ్ అండ్​ ప్రాసెసింగ్ హబ్’గా మారుస్తారు. ముఖ్యంగా గూడూరు (నెల్లూరు) విశాఖపట్నంలో అత్యాధునిక శుద్ధి ప్లాంట్లు ఏర్పాటు చేస్తారు. కేరళ ప్రభుత్వం ఇప్పటికే రూ. 42,000 కోట్లతో ప్రత్యేక రేర్ ఎర్త్ కారిడార్ ఏర్పాటుకు ప్రణాళికలు రచించింది. ఇది విజింజం పోర్ట్ నుండి చవర, కొచ్చి వరకు విస్తరించి ఉంటుంది.

తమిళనాడులో మణవలక్కురిచ్చి, తూత్తుకుడి ప్రాంతాలలో నిల్వల వెలికితీతతో పాటు, వీటిని ఉపయోగించి ‘పర్మనెంట్ మాగ్నెట్స్’ (అయస్కాంతాలు) తయారు చేసే పరిశ్రమలను ప్రోత్సహిస్తారు. ఒడిశాలోని గంజాం వంటి ప్రాంతాల్లో ఉన్న మోనాజైట్ నిల్వలను ఈ కారిడార్‌తో అనుసంధానిస్తారు. దీని కోసం ప్రభుత్వం దాదాపు రూ. 34,300 కోట్లు (ఏడేళ్ల కాలానికి) కేటాయించింది.

Read Also: రూ.10వేల కోట్లతో ‘బయోఫార్మా శక్తి’

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>