epaper
Sunday, February 1, 2026
spot_img
epaper

ఎర్రవల్లి నుంచి నందినగర్ బయలుదేరిన కేసీఆర్

క‌లం వెబ్ డెస్క్: ఫోన్ ట్యాపింగ్ విచార‌ణ కోసం మాజీ సీఎం కేసీఆర్(KCR) ఎర్ర‌వ‌ల్లి ఫామ్ హౌస్(Erravalli farmhouse) నుంచి నందిన‌గ‌ర్‌లోని త‌న ఇంటికి బ‌య‌లు దేరారు. ఈ సంద‌ర్భంగా కేసీఆర్ ఫామ్ హౌస్‌కు బీఆర్ఎస్(BRS) శ్రేణులు భారీ ఎత్తున త‌ర‌లివ‌చ్చారు. బీఆర్ఎస్ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు సీఎం రేవంత్‌, కాంగ్రెస్ ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా నినాదాలు చేస్తూ పాట‌లు పాడారు. ఫామ్ హౌస్ బ‌య‌ట ఆందోళ‌న‌ల‌ను అదుపు చేసేందుకు పోలీసులు తీవ్రంగా శ్ర‌మించాల్సి వ‌చ్చింది. బీఆర్ఎస్ నేత‌లు కేసీఆర్‌కు గుమ్మ‌డి కాయ‌తో దిష్టి తీసి నందిన‌గ‌ర్ నివాసానికి సాగ‌నంపారు. బీఆర్ఎస్ ఆందోళ‌న‌ల నేప‌థ్యంలో హైద‌రాబాద్‌లోని నందిన‌గ‌ర్‌లో, తెలంగాణ భ‌వ‌న్ వ‌ద్ద పోలీసులు భారీ బందోబ‌స్తు ఏర్పాటు చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>