రాపిడో రైడర్‌ను నడిరోడ్డుపై వేధించిన మహిళ.. వీడియో వైరల్

కలం, వెబ్ డెస్క్ : కష్టపడి పని చేసుకునే క్యాబ్, బైక్ రైడర్లపై కొంతమంది ప్రయాణికులు ప్రవర్తిస్తున్న తీరు తీవ్ర కలకలం రేపుతోంది. ఈ క్రమంలోనే వంద రూపాయల కోసం ఒక మహిళ రాత్రి వేళ నడిరోడ్డుపై రాపిడో బైక్ రైడర్‌ (Rapido Rider)ను తీవ్రంగా వేధించిన ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

వివరాల్లోకి వెళ్తే.. ఓ యువతి హైదరాబాద్‌లోని తన గమ్యస్థానానికి చేరుకోవడానికి ర్యాపిడో బైక్‌ను బుక్ చేసుకుంది. రైడర్ ఆమెను సురక్షితంగా లొకేషన్ వద్ద డ్రాప్ చేసి ప్రయాణానికి అయిన చార్జీ రూ. 100 ఇవ్వాల్సిందిగా కోరాడు. అయితే ఆ వంద రూపాయలు ఇవ్వడానికి నిరాకరించిన సదరు యువతి.. రైడర్‌తో గొడవకు దిగింది. అతడిని నడిరోడ్డుపై బూతులు తిడుతూ వికృత చేష్టలకు దిగింది. అవసరమైతే “వేధింపుల కేసు” (హరాస్‌మెంట్ కేస్) పెడతానంటూ ఆ రైడర్‌ను బెదిరించింది.

యువతి చేస్తున్న నిర్వాకాన్ని సదరు రాపిడో రైడర్ మొబైల్ ఫోన్‌లో రికార్డు చేశాడు. “డబ్బులు ఇవ్వకుండా నన్ను ఎందుకు తిడుతున్నారు? నా తప్పేముంది?” అంటూ.. ఆమెను వెంబడించి, వెంటనే పోలీస్ స్టేషన్‌కు రావాలని రాపిడో రైడర్ డిమాండ్ చేశాడు. కెమెరా చూసినా సరే ఆమె ఏమాత్రం తగ్గకుండా తిడుతూ అక్కడి నుంచి పారిపోవడానికి యత్నించింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు మహిళ ప్రవర్తనపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాపిడో రైడర్‌కు మద్దతుగా నిలుస్తూ, సదరు మహిళపై కఠిన చర్యలు తీసుకోవాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>