బంగారు నగలతో ర్యాపిడో డ్రైవర్ జంప్

కలం, వెబ్ డెస్క్: బంగారు నగల బ్యాగుతో ర్యాపిడో డ్రైవర్ (Rapido Rider) పరారైన ఘటన హైదరాబాద్‌లో చోటు చేసుకుంది. బంజారాహిల్స్‌లోని వివో సంస్థలో పనిచేస్తున్న దత్త ప్రసాద్ అనే వ్యక్తి నాగోల్‌లోని తన బంధువులకు బంగారు నగలు పంపించాలని ర్యాపిడో బైక్ పార్శిల్‌ను బుక్ చేశారు. జీడిమెట్లకు చెందిన మురళీ అనే ర్యాపిడో రైడర్ వచ్చి పార్శిల్ స్వీకరించడమే కాకుండా.. పెట్రోల్ ఖర్చుల పేరిట అదనంగా రూ.100 వసూలు చేసుకున్నాడు.

కొంత సేపటి తరువాత దత్త ప్రసాద్ బంధువులకు ఫోన్ చేయగా.. పార్శిల్ అందలేదని చెప్పారు. దీంతో రైడర్ మురళీకి ఫోన్ చేయగా.. రెస్పాన్స్ రాకపోగా నెంబర్ బ్లాక్ చేసినట్లు గుర్తించారు. ర్యాపిడో కస్టమర్ కేర్‌ను సంప్రదించినా.. సరైన స్పందన రాకపోవడంతో వెంటనే జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సుమారు రూ.62 వేల విలువైన బంగారు మెట్టెలు, ఇతర ఆభరణాలున్నాయని దత్త ప్రసాద్ ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

పోలీసుల హెచ్చరికలు..

బంగారు నగలతో ర్యాపిడో డ్రైవర్ (Rapido Rider) జంప్ అయిన ఉదంతం నేపథ్యంలో పోలీసులు కీలక హెచ్చరికలు చేస్తున్నారు. వస్తువులను పార్శిల్ చేసేటప్పుడు డెలివరీ చేసే వ్యక్తుల వివరాలు, ఏదైనా సమస్య వస్తే సంప్రదించాల్సిన నెంబర్లు, అవి పనిచేస్తున్నాయో.. లేదో చెక్ చేసుకోవాలన్నారు. బంగారం వంటి విలువైన ఆభరణాలు, వస్తువులన సాధారణ పార్శిల్ ద్వారా పంపించకపోవడమే మేలని స్పష్టం చేస్తున్నారు. అదే సమయంలో పార్శిల్ సేవా సంస్థలు వినియోగదారుల నమ్మకం, భద్రతపై మరింత ఎక్కువగా దృష్టి పెట్టాలన్నారు. రైడర్లను రిక్రూట్ చేసుకునే క్రమంలో వారి నేపథ్యాన్ని పరిశీలించాలని సూచించారు.

Also Read : దూసుకొస్తున్న మరో తుఫాన్.. ఏపీకి భారీ వర్ష సూచన!

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>