ఒవైసీ సోదరులు దేశ భక్తులా?: రామచందర్ రావు

కలం, వెబ్ డెస్క్: అసదుద్దీన్ ఒవైసీ, అక్బరుద్దీన్ ఒవైసీ దేశ భక్తులంటూ సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) చేసిన వ్యాఖ్యలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు (Ramchander Rao) ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి వ్యాఖ్యలు దేశాన్ని అవమానించడమేనని, ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం వారిని ఇంతలా కీర్తించడం ఆశ్చర్యం కలిగిస్తోందన్నారు. అసెంబ్లీలో వందేమాతరం గేయం పాడుతుంటే అక్బరుద్దీన్ సహా ఒక్క మజ్లిస్ ఎమ్మెల్యే కూడా నిలబడరని.. వారిని దేశ భక్తులని ఎలా అంటారని ప్రశ్నించారు. ప్రధాని మోదీ, అమిత్ షాకు దేశ భక్తి ఉందని సీఎం ఒప్పుకోవడం సంతోషకరమన్నారు. వారిద్దరితో ఒవైసీ సోదరులను పోల్చడమే విడ్డూరంగా ఉందన్నారు.

గతంలో వారి మాటలు మర్చిపోయారా..?

15 నిమిషాలు పోలీసులను పక్కకు పంపితే.. ఈ దేశంలో తమ తడాఖా చూపిస్తామని ఒవైసీ సోదరులు (Owaisi Brothers) గతంలో చేసిన వ్యాఖ్యలను సీఎం రేవంత్ మర్చిపోయారా.. అని రామచందర్ రావు (Ramchander Rao) ప్రశ్నించారు. గోమాంసం చాలా రుచికరంగా ఉంటుందన్న వారిని దేశ భక్తులుగా మెచ్చుకుంటూ సర్టిఫికేట్లు ఇవ్వడమేంటన్నారు. అసలు రేవంత్ రెడ్డి దృష్టిలో దేశ భక్తి అంటే ఏంటో నిర్వచనం చెప్పాలని డిమాండ్ చేశారు. రాహుల్ గాంధీకి పాకిస్థాన్, చైనాల మీద ఎలాంటి దేశ భక్తి ఉందో.. ఒవైసీలకు కూడా అలాగే ఉంటుందని స్పష్టం చేశారు. మజ్లిస్ పార్టీ మెప్పు కోసం రేవంత్ రెడ్డి చేస్తున్న ఇలాంటి రాజకీయాలను రాష్ట్ర ప్రజలు ఎప్పటికీ హర్షించబోరని హెచ్చరించారు.

Also Read : ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి నిరసన సెగ.. అంతంపేటలో ఉద్రిక్తత!

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>