కలం, వెబ్ డెస్క్: సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఇంటి సమీపంలో జరిగిన జంట హత్యల కేసు (Double Murder case)లో షాకింగ్ విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆన్‌లైన్‌లో జూదానికి అలవాటైన ఓ వ్యక్తి డబ్బుల కోసం ఈ దారుణాలకు పాల్పడినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 44లో ఓ వైద్యుడి ఇంట్లో కారు డ్రైవర్‌గా పని చేసే వాసును నిందితుడిగా గుర్తించారు. వాసు ఆన్‌లైన్‌లో జూదం వ్యసనంతో డబ్బుల కోసం ఈ హత్య చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ముందుగా వాసు మార్చి 11న యాదమ్మ అనే వృద్ధురాలికి కారులో లిఫ్ట్ ఇస్తానంటూ కారు ఎక్కించుకున్నాడు. ఆమెను హత్య చేసి ఆమె ఆభరణాలు తీసుకున్నాడు. తర్వాత ఆ ఆభరణాలు అమ్మేసి రూర.26,500తో ఆన్‌లైన్‌లో జూదం ఆడాడు. అందులో డబ్బులన్నీ పోగొట్టుకున్నాడు. తర్వాత మళ్లీ డబ్బుల కోసం వాసు ఇదే దారిని ఎంచుకున్నాడు. మార్చి 14న మరో వృద్ధురాలిపై కన్నేశాడు. మంగమ్మ అనే వృద్ధురాలికి లిఫ్ట్ ఇస్తానంటూ కారులో ఎక్కించుకున్నాడు. యాదమ్మ లాగానే ఆమెను కూడా హత్య చేసి ఆభరణాలు తీసుకొని అమ్ముకున్నాడు. ఈ మహిళలను హత్య చేసిన రోజే శవాలను కారులో తీసుకెళ్లి మోకిల దగ్గర వదిలేశాడు. ఈ ఘటనలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఫిలింనగర్ పోలీసులు రంగంలోకి దిగి పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి నిందితుడు వాసును అదుపులోకి తీసుకొని రిమాండ్‌కు తరలించారు.
Read Also: సెక్రటేరియట్ మెయింటెనెన్స్‌పై సర్కార్ నిర్లక్ష్యం: వేముల ప్రశాంత్ రెడ్డి
Follow Us On: X(Twitter)

