Mobile Popup Ad
Mobile Popup Ad

‘RAPO23’తో డైరెక్టర్ అవతారంలో రామ్ పోతినేని

కలం, సినిమా : టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని (Ram Pothineni) బర్త్‌డే  సందర్భంగా అభిమానులకు అదిరిపోయే సర్‌ప్రైజ్ ఇచ్చారు. ఈరోజు (మే 15) రామ్ కొత్త చిత్రం ‘RAPO23′ ను అధికారికంగా ప్రకటించారు. ఈ చిత్రానికి ప్రత్యేకత ఏమిటంటే.. ఇందులో రామ్ హీరోగా నటించడమే కాకుండా స్వయంగా దర్శకత్వ బాధ్యతలు కూడా చేపట్టనున్నారు.

ఈ సందర్భంగా విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. పోస్టర్‌లో రామ్  పవర్‌ఫుల్ లుక్‌లో కనిపిస్తూ, ‘వీర’ అనే పాత్రలో నటిస్తున్నట్లు వెల్లడించారు. మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందనున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటివరకు నటుడిగా ఎన్నో హిట్లు అందుకున్న రామ్.. ఇప్పుడు దర్శకుడిగా కూడా తన ప్రతిభను చూపించేందుకు సిద్ధమవుతున్నారు. దీంతో అభిమానులు సోషల్ మీడియాలో ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ, ‘RAPO23’ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>