వీరాభిమాని కల నెరవేర్చిన రామ్ పోతినేని

కలం, సినిమా :  టాలీవుడ్ యంగ్ హీరో రామ్ పోతినేని(Ram Pothineni) మరోసారి తన మంచి మనసు చాటుకున్నారు. 18 ఏళ్లుగా అరుదైన వ్యాధి ‘ఫ్రీడ్రిచ్ అటాక్సియా’ తో పోరాడుతున్న తన వీరాభిమాని కలను రామ్ నిజం చేశారు. తనను కలవాలని ఆ యువతి వ్యక్తం చేసిన కోరిక గురించి తెలుసుకున్న రామ్ పోతినేని, స్వయంగా ఆమె ఇంటికి వెళ్లారు. అక్కడ ఆమెతో కొంత సమయం గడిపి మాట్లాడి, ఆప్యాయంగా పలకరించారు. ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని ఆమెకు ధైర్యం చెప్పారు. ఈ స్పెషల్ సర్‌ప్రైజ్‌తో ఆ యువతి ఎంతో భావోద్వేగానికి గురైంది. రామ్ పోతినేని చేసిన ఈ చర్య ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అభిమానులపై ఆయన చూపించే ప్రేమ, మానవత్వానికి ఇది మరో ఉదాహరణగా నిలిచింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>