కలం, వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో మరో కీలక ఘట్టం ఆవిష్కృతం అయింది. రాష్ట్రంలోనే మొట్టమొదటి విమాన పైలట్ల ట్రైనింగ్ సెంటర్ ( Pilot Training Centre) ప్రారంభమైంది. కర్నూలు ఎయిర్‌పోర్టు (Kurnool Airport)లో పైలట్ శిక్షణ కేంద్రాన్ని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు శనివారం ప్రారంభించారు.
అత్యాధునిక హంగులతో రాష్ట్రంలోనే తొలిసారిగా కర్నూలు ఎయిర్‌పోర్టులో పైలట్ ట్రైనింగ్ ( Pilot Training Centre) సెంటర్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు బీసీ జనార్ధన్, టీజీ భరత్‌తో పాటు ఎంపీ బస్తిపాటి నాగరాజు, పలువురు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. పైలట్ శిక్షణకు అవసరమైన అవకాశాలను అందుబాటులోకి తీసుకురావడంలో ఈ కేంద్రం కీలకంగా మారనుంది.

