కలం, వెబ్ డెస్క్: పశ్చిమాసియా, గల్ఫ్ కంట్రీస్‌లో యుద్ధం వల్ల చిక్కుకుపోయిన భారతీయులను అక్కడి నుంచి క్షేమంగా తీసుకొస్తామని కేంద్ర పౌరవిమానయాన శాఖ రామ్మోహన్ నాయుడు(Ram Mohan Naidu) అన్నారు. సోమవారం ఆయన పార్లమెంట్లో మాట్లాడుతూ ప్రతిపక్షాల ప్రశ్నకు జవాబిచ్చారు. ప్రస్తుతం పశ్చిమాసియాలో అనిశ్చిత పరిస్థితులు ఉన్నందున విమానాల రాకపోకలకు ఇబ్బంది కలుగుతోందన్నారు. ఈ క్రమంలో ఆయా దేశాల్లోని మన రాయబార కార్యాలయాలతో నిత్యం సంప్రదింపులు జరుపుతున్నామని, పరిస్థితులు మెరుగు పడగానే పూర్తిగా విమాన సేవలు ప్రారంభమవుతాయని అన్నారు. యుద్ధ ప్రభావం వల్ల తాత్కాలింగా కొన్ని సర్వీసులు మాత్రమే ఇప్పుడు నడుస్తున్నట్లు సభకు వెల్లడించారు. గల్ఫ్ దేశాల్లో చిక్కుకున్న లక్షలాది మంది భారతీయులను క్షేమంగా తీసుకురావడానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని చెప్పారు.
Read Also: రోజూ తలనొప్పి వస్తుందా.. డిజిటల్ స్క్రీన్లే కారణం..!
Follow Us On: Facebook

