రోజూ తలనొప్పి వస్తుందా.. డిజిటల్ స్క్రీన్లే కారణం..!

కలం, వెబ్ డెస్క్ : తల నొప్పి(Headache).. నిద్ర మేల్కోవడం ఆలస్యం.. ఎవరో సుత్తితో తలపై కొడుతున్న బాధ. ఇది నిద్ర లేచిన సమయంలోనే కాదు. రోజంతా కూడా వస్తుంటుంది. ప్రతి రోజూ తలనొప్పితో బాధపడుతున్న వారి సంఖ్య రోజుకు రోజుకు అధికం అవుతోంది. ఈ క్రమంలోనే న్యూరాలజిస్ట్‌లు (Neurologist Madhukar Bhardwaj) అసలు దీనికి కారణం ఏంటి ? ఈ తలనొప్పి ఎందుకు వస్తుంది ? అనే విషయాన్ని వివరిస్తున్నారు.

నేటి డిజిటల్ యుగంలో.. మన రోజు ప్రారంభమవడం, ముగియడం కూడా డిజిటల్ స్క్రీన్స్‌తోనే జరుగుతుంది. ఎదురుగా ఉన్నవారితో మాట్లాడే సమయం కూడా లేనంతగా స్క్రీన్ల లోకంలో మునిగిపోయి ఉంటున్నాం. ఇదే మనకు వస్తున్న తలనొప్పికి ప్రధాన కారణం అవుతుందని వైద్యులు చెప్తున్నారు. తదేకంగా డిజిటల్ స్క్రీన్ (Digital screen) చూడటం వల్ల కళ్లకే కాకుండా, మీ మెదడుపై కూడా తీవ్ర ఒత్తిడి పెరుగుతుంది. ఆ ఒత్తిడి దీర్ఘకాలిక తలనొప్పికి దారితీస్తోందని న్యూరాలజిస్టులు హెచ్చరిస్తున్నారు.

కంప్యూటర్లపై రోజుకు మూడు గంటల కంటే ఎక్కువ సమయం గడిపే వారిలో దాదాపు 90 శాతం మంది డిజిటల్ ఐ స్ట్రెయిన్, తలనొప్పి వంటి సమస్యలను ఎదుర్కొంటున్నారని పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. ఈ సమస్యపై ఆకాష్ హెల్త్‌కేర్ న్యూరాలజీ విభాగం హెడ్ డాక్టర్ మధుకర్ భరద్వాజ్(Madhukar Bhardwaj) కీలక విషయాలను పంచుకున్నారు.

డిజిటల్ పరికరాలను నిరంతరం చూడటం వల్ల కంటి కండరాలతో పాటు మెదడులోని విజువల్ కార్టెక్స్‌కు అనుసంధానించబడిన నరాల మార్గాలపై తీవ్ర ఒత్తిడి పడుతుందని ఆయన వివరించారు. స్క్రీన్ల నుండి వెలువడే బ్లూ లైట్ రెటినాను అతిగా ప్రేరేపించడమే కాకుండా, శరీర జీవ గడియారాన్ని (సిర్కాడియన్ రిథమ్) దెబ్బతీస్తుందని పేర్కొన్నారు. కేవలం వెలుతురు మాత్రమే కాకుండా, మనం కూర్చునే విధానం కూడా తలనొప్పికి ప్రధాన కారణమని డాక్టర్ భరద్వాజ్ వివరించారు. ఈ సమస్య నుండి బయటపడటానికి 20-20-20 సూత్రాన్ని పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు. ప్రతి 20 నిమిషాలకు ఒకసారి, 20 అడుగుల దూరంలో ఉన్న వస్తువును 20 సెకన్ల పాటు చూడటం వల్ల కంటి కండరాలకు , మెదడుకు విశ్రాంతి లభిస్తుంది.

Read Also: టీలో చక్కెర మానేయాలా.. ? ఈ చాక్లెట్ హ్యాక్ ట్రై చేయండి..

Follow Us On: Facebook

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>