Mobile Popup Ad
Mobile Popup Ad

రామ్ చరణ్ ‘రచ్చ’ సినిమాకు 14 ఏళ్లు..

కలం, సినిమా : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) కెరీర్‌లో మాస్ ఇమేజ్‌ను మరో స్థాయికి తీసుకెళ్లిన చిత్రం ‘రచ్చ'(Racha) . ఈ బిగ్గెస్ట్ మాస్ మూవీ విడుదలై నేటికి (ఏప్రిల్ 5) 14 సంవత్సరాలు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో “14 ఇయర్స్ ఫర్ రచ్చ” అనే హ్యాష్‌ట్యాగ్ ట్రెండ్ అవుతోంది. 2012లో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించింది. ముఖ్యంగా రామ్ చరణ్ మాస్ లుక్, స్టైలిష్ యాక్షన్ సీన్స్, డ్యాన్స్‌లు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. రామ్  చరణ్ యాక్టింగ్, తమన్నా గ్లామర్ ఈ సినిమాకు ప్లస్‌గా మారాయి

సంపత్ నంది దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో కథ, యాక్షన్ ఎపిసోడ్స్‌తో పాటు మెలోడీ కింగ్ మణిశర్మ అందించిన  సాంగ్స్  కూడా మంచి ఆదరణ పొందాయి. ముఖ్యంగా మాస్ ఆడియన్స్‌ను టార్గెట్ చేస్తూ రూపొందించిన సన్నివేశాలు సినిమాను సూపర్ హిట్‌గా నిలిపాయి. రచ్చ సినిమాకు 14 ఏళ్లు పూర్తయిన సందర్భంగా అభిమానులు సోషల్ మీడియాలో సినిమా క్లిప్స్, డైలాగ్స్, పోస్టర్స్‌ను షేర్ చేస్తూ తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>