కలం, వెబ్ డెస్క్ : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం ‘పెద్ది’ (Peddi) మేకర్స్ కు బిగ్ రిలీఫ్ దక్కింది. ఈ మేరకు మెగాస్టార్ చిరంజీవి జోక్యంతో ఎగ్జిబిటర్లు, నిర్మాతలకు మధ్య నడుస్తున్న పర్సంటేజీ (కమిషన్) వివాదం సద్దుమణిగింది. చిరంజీవి ఇరు వర్గాలతో జరిపిన చర్చలు సఫలమవడంతో, ‘పెద్ది’ సినిమాను పాత పద్ధతి అయిన రెంటల్ (అద్దె) విధానంలోనే థియేటర్లలో ప్రదర్శించడానికి ఎగ్జిబిటర్లు అంగీకరించారు. ఒకవేళ ప్రభుత్వం నుంచి టికెట్ ధరల పెంపునకు అనుమతి లభిస్తే, ఆ పెంచిన ధరలపై ఎగ్జిబిటర్లకు 7.5 శాతం అదనపు వాటా ఇచ్చేలా ఇరుపక్షాల మధ్య ఒక సయోధ్య ఒప్పందం కుదిరింది.
ఈ క్రమంలో జూన్ 4న విడుదల కానున్న పెద్ది సినిమాను రెంటల్ విధానంలోనే ప్రదర్శించాలని ఎగ్జిబిటర్లు నిర్ణయించారు. జూన్ 30 తర్వాత విడుదలయ్యే చిత్రాలకు పర్సంటేజీ విధానం వర్తింపజేస్తామని తెలిపారు. దీంతో తెలంగాణ ఎగ్జిబిటర్లు తీసుకున్న నిర్ణయంపై చిరంజీవి హర్షం వ్యక్తం చేశారు. ఫిల్మ్ ఛాంబర్ కమిటీ నివేదిక మేరకు నడుచుకోవాలని సూచించారు.

