పెద్ది : మాస్ రాంపేజ్ కౌంట్‌డౌన్ ఫిక్స్..

కలం, సినిమా : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్(Ram Charan), టాలెంటెడ్ డైరెక్టర్ బుచ్చి బాబు సన (Buchi Babu Sana) కాంబినేషన్ లో వస్తున్న బిగ్గెస్ట్ యాక్షన్ మూవీ “పెద్ది” (Peddi). ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వృద్ది సినిమాస్ బ్యానర్‌పై గ్రాండ్‌గా తెరకెక్కుతున్న ఈ బిగ్గెస్ట్ మూవీలో బాలీవుడ్ క్యూట్ బ్యూటీ జాన్వి కపూర్ హీరోయిన్‌గా నటిస్తుంది.  ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందించిన పెద్ది సినిమా సాంగ్స్ నెట్టింట ఫుల్ వైరల్ అవుతున్నాయి.

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఏప్రిల్ 30న పెద్ది మూవీ ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ కానుంది. ఇదిలా ఉంటే రేపు రామ్ చరణ్ (Ram Charan) బర్త్డే సందర్భంగా పెద్ది మేకర్స్ ఫ్యాన్స్‌కి స్పెషల్ సర్ప్రైజ్ ప్లాన్ చేశారు. పెద్ది నుంచి అదిరిపోయే టీజర్ రానున్నట్లు సమాచారం. తాజాగా పెద్ది టీం స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేసింది. ఇంకా ఒక్కరోజే మిగిలి ఉంది. బ్యాట్ పట్టుకున్న అతడిని చూశారు కదా, ఇప్పుడు గదతో విరుచుకుపడబోతున్నాడు. రేపు (మార్చి 27) 9.45 గంటలకు అతను రణరంగంలోకి అడుగుపెట్టబోతున్నదంటూ ఇంట్రెస్టింగ్ పోస్టర్ రిలీజ్ చేశారు.

Read Also: నిజమైన ప్రేమా? నటనా..? ఎలా గుర్తించాలి ?

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>