కలం, సినిమా : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan), టాలెంటెడ్ డైరెక్టర్ బుచ్చి బాబు సనా (Buchi Babu Sana) కాంబినేషన్‌లో తెరకెక్కిన మోస్ట్ అవైటెడ్ మూవీ ‘పెద్ది'(Peddi). జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ వరుస ప్రమోషన్స్‌తో బిజీగా ఉన్నారు. నిన్న భోపాల్‌లో జరిగిన పెద్ది మూవీ భారీ మ్యూజికల్ ఈవెంట్ సూపర్ సక్సెస్ అయింది. ఈ ఈవెంట్‌తో పెద్ది సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి.
ఇదిలా ఉంటే పెద్ది మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా మేకర్స్ రిలీజ్ చేసిన ‘హెల్లల్లల్లో’ (Hellallallo) సాంగ్ ప్రోమోకు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. తాజాగా మేకర్స్ ఈ సాంగ్ ఫుల్ వీడియో రిలీజ్ చేశారు. ఈ సాంగ్‌కు ఏఆర్ రెహమాన్ అదిరిపోయే ట్యూన్ ఇవ్వగా.. రామ్ చరణ్, శృతి హాసన్, జాన్వి కపూర్ మాస్ స్టెప్స్ మరింతగా ఆకట్టుకున్నాయి. “ఇకపై హలో కాదు.. #హెల్లల్లల్లో” అంటూ చిత్ర యూనిట్ చేసిన పోస్టు అభిమానులలో ఈ సినిమాపై మరింత హైప్ పెంచింది.

