Mobile Popup Ad
Mobile Popup Ad

‘హెల్లల్లల్లో’ సాంగ్ ప్రోమో రిలీజ్.. పెద్ది నుంచి మాస్ బీట్

కలం, సినిమా : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) హీరోగా, టాలెంటెడ్ దర్శకుడు బుచ్చిబాబు సనా (Buchi Babu Sana) కాంబినేషన్‌లో తెరకెక్కిన భారీ పాన్ ఇండియా చిత్రం పెద్ది (Peddi) నుంచి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘హెల్లల్లల్లో’ సాంగ్ ప్రోమో విడుదలైంది. “సింగ్ విత్ అజ్ #హెల్లల్లల్లో’” అంటూ విడుదలైన ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రామ్ చరణ్, శృతిహాసన్ మాస్ స్టెప్స్, రెహమాన్ మాస్ బీట్, ఎనర్జిటిక్ విజువల్స్‌తో ఈ ప్రోమో అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. పూర్తి పాటను మే 23న భోపాల్‌లో గ్రాండ్ ఈవెంట్‌లో విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఇప్పటికే ‘పెద్ది’ సినిమాపై భారీ అంచనాలు నెలకొనగా, ఈ సాంగ్ ప్రోమోతో మూవీపై హైప్ మరింత పెరిగింది. ప్రపంచవ్యాప్తంగా జూన్ 4న ఈ చిత్రం గ్రాండ్‌ రిలీజ్  కానుంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>