‘పెద్ది’ గేమ్ మొదలు.. మేకర్స్ ఇంట్రెస్టింగ్ అప్డేట్

కలం, సినిమా : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) నటిస్తున్న లేటెస్ట్ యాక్షన్ మూవీ “పెద్ది”(Peddi). టాలెంటెడ్ డైరెక్టర్ బుచ్చిబాబు సన (Buchi Babu Sana) తెరకెక్కిస్తున్న ఈ బిగ్గెస్ట్ మూవీ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ క్యూట్ బ్యూటీ జాన్వీ కపూర్ (Janhvi Kapoor) హీరోయిన్‌గా నటిస్తుండగా.. ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్(AR Rahman) మ్యూజిక్ అందిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుండి రిలీజ్ అయిన రెండు సాంగ్స్ నెట్టింట తెగ వైరల్ అయ్యాయి. రామ్ చరణ్ మాస్ స్టెప్స్ ఫ్యాన్స్ కి విపరీతంగా నచ్చేశాయి.

వృద్ది సినిమాస్ బ్యానర్‌పై గ్రాండ్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతుంది. ఏప్రిల్ 30న ప్రపంచవ్యాప్తంగా పెద్ది సినిమా గ్రాండ్ రిలీజ్ కానుంది. ఇదిలా ఉంటే మార్చి 27 రామ్ చరణ్ (Ram Charan) బర్త్డే సందర్భంగా మేకర్స్ ఫ్యాన్స్ కోసం బిగ్ సర్ప్రైజ్ ప్లాన్ చేస్తున్నారు. ఆ రోజు పెద్ది టీజర్ రిలీజ్ చేయబోతున్నట్లు సమాచారం. తాజాగా ‘పెద్ది’ గేమ్ మొదలవుతుంది మాస్ రాంపేజ్ కోసం సిద్దం అవ్వండి అంటూ మేకర్స్ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది.

 

 

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>