Mobile Popup Ad
Mobile Popup Ad

మెదక్‌లో దారుణం.. వృద్ధ దంపతులపై దాడి, చైన్ స్నాచింగ్

కలం మెదక్ బ్యూరో: రాష్ట్రవ్యాప్తంగా చైన్ స్నాచర్లు (Chain Snatching) రెచ్చిపోతున్నారు. మహిళలు, వృద్ధులు అనే తేడా లేకుండా అతి దారుణంగా దాడులు చేస్తూ భయాభ్రాంతులకు గురిచేస్తున్నారు. మెదక్ (Medak) జిల్లా చిన్నశంకరంపేట మండలం జంగారాయి గ్రామంలో పట్టపగలు దొంగ‌లు హ‌ల్ చ‌ల్ చేశారు. జంగారాయికి చెందిన వృద్ధ దంపతులు తమ్మల అంజయ్య, సావిత్రి దంపతులు ఇంట్లో ఉండ‌గా, ఇద్దరు దుండగులు వారితో మాట‌లు క‌లిపారు. ఒక్కసారిగా సుత్తితో దాడి చేసి చైన్ స్నాచింగ్ పాల్పడ్డారు. ఐదు తులాల‌ బంగారం లాక్కొని బైక్‌పై పరారయ్యారు.

దాడిలో తీవ్రంగా గాయపడిన వృద్ధ దంపతులను మెదక్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు న‌మోదు చేసి విచారణ చేపట్టారు. సీసీ కెమెరాల సహాయంతో నిందితుల కోసం గాలిస్తున్నారు. దొంగలు సుత్తితో దాడి చేసి.. స్నాచింగ్ చేయడంతో జంగారాయి గ్రామంలో భయాందోళనలు నెలకొన్నాయి.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>