Mobile Popup Ad
Mobile Popup Ad

ఆ ఇద్దరు అదుర్స్.. క్యారెక్టర్ కోసం దేనికైనా సిద్ధం

కలం, వెబ్ డెస్క్: ఇండస్ట్రీలో ఇప్పుడు మేకోవర్ (Transformation) ట్రెండ్ నడుస్తోంది. ఒకప్పుడు కేవలం మేకప్, కాస్ట్యూమ్స్‌తో సరిపెట్టే హీరోలు, ఇప్పుడు పాత్ర స్వభావం కోసం ప్రాణం పెడుతున్నారు. క్యారెక్టర్ డిమాండ్ చేస్తే ఎంతటి శారీరక మార్పులకైనా వెనుకాడటం లేదు. ప్రస్తుతం రామ్ చరణ్, శర్వానంద్ (Ram Charan-Sharwanand) లుక్స్ ఫ్యాన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. రామ్ చరణ్ ‘పెద్ది’ (Peddi) సినిమా కోసం తన లుక్‌ను పూర్తిగా మార్చేసి అభిమానులను ఆశ్చర్యపరిచాడు. ఈ సినిమా కోసం చరణ్ కఠినమైన వర్కవుట్లు చేసి, కండలు పెంచి అల్ట్రా మాస్ లుక్‌లో కనిపిస్తున్నారు. చరణ్ బాడీ ట్రాన్స్‌ఫర్మేషన్ చూస్తుంటే పాత్ర కోసం ఆయన ఎంతలా శ్రమించారో అర్థమవుతోంది.

మరోవైపు వైవిధ్యమైన కథలను ఎంచుకునే శర్వానంద్ సైతం మేకోవర్ విషయంలో తగ్గేదేలే అంటున్నాడు. బైకర్ సినిమా కోసం శర్వానంద్ భారీగా బరువు తగ్గాడు. ఒక రేసర్ బాడీ లాంగ్వేజ్‌ను ప్రతిబింబించేలా రూపురేఖలను మార్చుకుని అందరినీ ఆకట్టుకుంటున్నాడు. రామ్ చరణ్, శర్వానంద్ ఇద్దరూ తమ పాత్రల కోసం పడుతున్న ఈ కష్టం, ప్రస్తుత తరం హీరోలు సినిమా పట్ల చూపిస్తున్న అంకితభావానికి నిదర్శనంగా నిలుస్తోంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>