కలం, వెబ్‌డెస్క్: రాఖీ పౌర్ణమి (Raksha Bandhan) పండుగ సందర్భంగా మహారాష్ట్రలోని నాగ్‌పూర్ విద్యార్థులు (Nagpur Students) వినూత్న రీతిలో వేడుకలు మొదలుపెట్టారు. దేశ సరిహద్దుల్లో రక్షణ కోసం విధులు నిర్వహిస్తున్న భారత సైనికులకు (Indian Soldiers) కృతజ్ఞతలు తెలియజేసేందుకు విశేష కార్యక్రమాన్ని చేపట్టారు. విద్యార్థులు తమ చేతులతో మూడు లక్షలకు పైగా రాఖీలను తయారు చేసి సైనికులకు పంపేందుకు సిద్ధం చేశారు.
ఈ కార్యక్రమం ద్వారా దేశ భద్రత కోసం కుటుంబాలకు దూరంగా సేవలందిస్తున్న జవాన్ల పట్ల గౌరవం, కృతజ్ఞత, సంఘీభావాన్ని వ్యక్తం చేయాలనే ఉద్దేశంతో ఈ రాఖీలను రూపొందించినట్లు నిర్వాహకులు తెలిపారు. రక్షాబంధన్ సందర్భంగా ఈ రాఖీలు సరిహద్దు ప్రాంతాల్లో విధులు నిర్వహిస్తున్న సైనికులకు చేరేలా ఏర్పాట్లు చేస్తున్నారు. విద్యార్థులు చేపట్టిన ఈ కార్యక్రమాన్ని నెటిజన్లు, ప్రజలు అభినందిస్తున్నారు. విద్యార్థులు సామూహికంగా రాఖీలు తయారు చేస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
Also Read : మిట్టె జలపాతం.. ప్రకృతి ఒడిలో భూతల స్వర్గం!
Follow Us On : WhatsApp

