కలం, వెబ్ డెస్క్: ఏపీలో ‘నేతన్న సేవలో’ (Nethanna Sevalo) పథకాన్ని శుక్రవారం కూటమి ప్రభుత్వం ప్రారంభించింది. ఈ మేరకు సీఎం చంద్రబాబు (CM Chandrababu).. బాపట్ల జిల్లా చీరాల నియోజకవర్గం కొత్తపేటలో నిర్వహించిన 12వ జాతీయ చేనేత దినోత్సవ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని 71,536 చేనేత కుటుంబాల అకౌంట్లలో రూ.25వేల చొప్పున రూ.179 కోట్లను సీఎం జమ చేశారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు.
దేశవ్యాప్తంగా చేనేత రంగానికి ఉన్న ప్రాధాన్యతను గుర్తు చేస్తూ ప్రతి ఏటా ఆగస్టు 7న జాతీయ చేనేత దినోత్సవాన్ని నిర్వహించుకుంటున్నామని అన్నారు. అధికారంలో ఉన్నా, విపక్షంలో ఉన్నా చేనేత కార్మికులు టీడీపీ వెంటే ఉన్నారని చెప్పారు. రెండేళ్ల పాలనలో ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకున్నామని చంద్రబాబు (CM Chandrababu) స్పష్టం చేశారు. చేనేత కార్మికులను ఆదుకునేందుకే అర్హులైన ప్రతి నేతన్న కుటుంబానికి రూ.25 వేల ఆర్థిక సాయం అందజేస్తున్నామని తెలిపారు.
మొత్తం 71,636 చేనేత కుటుంబాలకు పథకం వర్తిస్తుందని పేర్కొన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలో భాగంగా ఈ పథకాన్ని అమలు చేస్తున్నట్లు తెలిపారు. రూ.179 కోట్లను నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేశామన్నారు. నేతల ఆర్థిక పురోగతి కోసం స్కీం నిబంధనల్లో కీలక మార్పులు చేశామని అన్నారు. సొంత మగ్గం ఉన్న ప్రతి చేనేత కుటుంబానికి ఈ ఆర్థిక సాయం అందిస్తుందని చెప్పారు.
Also Read : గుజరాత్లో మిస్టరీ బావి.. కదులుతున్న నీరు!
Follow Us On : WhatsApp

