యాతాలకుంట టన్నెల్ పూర్తిచేసి, గోదావరి జలాలు అందిస్తాం: తుమ్మల

​కలం, ఖమ్మం బ్యూరో: సీతారామ ఎత్తిపోతల పథకంలో కీలకమైన యాతాలకుంట టన్నెల్ పనులను రాబోయే 25 రోజుల్లో పూర్తి చేసి గోదావరి జలాలను అందిస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Thummala Nageswara Rao) స్పష్టం చేశారు. అక్టోబర్‌లో సీఎం రేవంత్ చేతుల మీదుగా గోదావరి జలాలను అందుబాటులోకి తెస్తామన్నారు. సోమవారం సత్తుపల్లి మండలం యాతాలకుంట వద్ద టన్నెల్ పనులు, సీతారామ మూడో పంప్‌హౌస్‌ను అశ్వారావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ, కలెక్టర్ అంకిత్‌తో కలిసి మంత్రి పరిశీలించారు.

ఈ సందర్భంగా కమలాపురం పంప్‌హౌస్ మోటార్ ఆన్ చేసి అన్నదైవం ప్రాజెక్టుకు నీటిని విడుదల చేశారు. అనంతరం కుమ్మరిపాడు గ్రామంలో రూ. 4.63 కోట్ల వ్యయంతో నిర్మించిన హై లెవల్ బ్రిడ్జి, బిటీ రోడ్డును ప్రారంభించారు. ​ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. నాణ్యత, భద్రత ప్రమాణాలకు అనుగుణంగా టన్నెల్‌లోని మిగిలిన పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

సత్తుపల్లి ట్రంక్‌కు గోదావరి నీటిని తరలించేందుకు భూసేకరణ సమస్యలను పరిష్కరిస్తూ ఇటీవల రూ. 48 కోట్లు విడుదల చేశామని తెలిపారు. ప్రస్తుత వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా ఖరీఫ్ పంటలను కాపాడుకోవడానికి దమ్మపేట, అశ్వారావుపేట ప్రాంతాల్లోని 80 వేల ఎకరాల ఆయిల్‌పామ్ తోటలకు సీతారామ జలాలను సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. నీటి వృధాను తగ్గించేందుకు పైప్‌లైన్, డ్రిప్ విధానాలను ప్రోత్సహిస్తామని చెప్పారు. ప్రాజెక్టు పనుల పురోగతిపై వారానికోసారి కలెక్టర్, ప్రజాప్రతినిధులు సమీక్ష జరపాలని ఆదేశించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>