బంగ్లాదేశ్ చిత్తు.. భారత్ క్వార్టర్స్‌కు!

కలం, స్పోర్ట్స్ : ఆసియా గేమ్స్‌లో (Asian Games 2026) భారత పురుషుల బ్యాడ్మింటన్ జట్టు సత్తా చాటింది. బంగ్లాదేశ్‌పై 3-0తో ఘన విజయం సాధించి క్వార్టర్‌ఫైనల్‌కు (Badminton Quarterfinals) దూసుకెళ్లింది. వరుసగా మూడు సింగిల్స్ మ్యాచ్‌ల్లో విజయం సాధించిన భారత్.. డబుల్స్ మ్యాచ్ అవసరం లేకుండానే పోరును ముగించింది. తొలి మ్యాచ్‌లో లక్ష్య సేన్ 21-4, 21-12తో అయ్మాన్ ఇబ్న్ జమాన్‌పై విజయం సాధించి భారత్‌కు శుభారంభం అందించాడు. దీంతో భారత్ 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. రెండో మ్యాచ్‌లో ఆయుష్ శెట్టి 21-4, 21-13తో గౌరబ్ సింఘాను ఓడించి ఆధిక్యాన్ని 2-0కు పెంచాడు.

భారత్ విజయాన్ని ఖరారు చేసేందుకు బరిలోకి దిగిన అనుభవజ్ఞుడు కిదాంబి శ్రీకాంత్.. అల్ అమీన్ జుమర్‌పై 21-15, 21-9తో వరుస గేముల్లో గెలిచాడు. దీంతో భారత్ 3-0తో మ్యాచ్‌ను సొంతం చేసుకుంది. మూడు సింగిల్స్‌లోనే విజయం ఖరారు కావడంతో డబుల్స్ మ్యాచ్‌లు అవసరం లేకుండానే భారత్ క్వార్టర్‌ఫైనల్‌కు చేరింది. తదుపరి రౌండ్‌లో భారత్ జపాన్‌తో తలపడే అవకాశం ఉంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>