కలం, కరీంనగర్: రాఖీ పౌర్ణమి (Raksha Bandhan)ని పురస్కరించుకొని కరీంనగర్‌లోని శ్రీ సరస్వతీ శిశు మందిర్ (Sri Saraswathi Shishu Mandir) పాఠశాలలో ముందస్తు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తి శ్రద్ధలతో యజ్ఞాన్ని నిర్వహించారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొని వేద మంత్రోచ్ఛారణల మధ్య హవన కార్యక్రమాన్ని చేపట్టారు.
రక్షాబంధన్ పండుగ అన్నాచెల్లెళ్ల ఆత్మీయతకు, పరస్పర ప్రేమకు, రక్షణ భావానికి ప్రతీక అని ఉపాధ్యాయులు విద్యార్థులకు వివరించారు. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు, సోదరభావం, దేశభక్తి వంటి విలువలను విద్యార్థుల్లో పెంపొందించడమే ఇటువంటి కార్యక్రమాల ముఖ్య ఉద్దేశమని పాఠశాల ప్రధానాచార్యులు మోర రణధీర్ తెలిపారు.
యజ్ఞం అనంతరం విద్యార్థులు పరస్పరం రాఖీలు కట్టుకుని రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. పాఠశాల ఆవరణం భక్తి, ఆనందోత్సాహాలతో కళకళలాడింది. కార్యక్రమంలో కార్యదర్శి ఇంజనీర్ కోల అన్నారెడ్డి, ఎలగందుల సత్యనారాయణ, డా.ఎలగందుల శ్రీనివాస్, కొణిజర్ల మహేష్, శిరీష, పులాల శ్యామ్, అల్లాడి ఆనంద్ కుమార్, ముసుకుల విద్యాసాగర్ రెడ్డి, పండుగ నాగరాజు, టి రాజేశ్వర్ రావు, అప్పిడి వకుళా దేవి తదితరులు పాల్గొన్నారు.

