కలం, వెబ్ డెస్క్ : ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్ గంగా బ్యారేజీ సమీపంలో విమాన ప్రమాదం చోటుచేసుకుంది. నత్తూపూర్వ గ్రామానికి సమీపంలోని గంగా నది ఒడ్డున గల పొలాల్లో గర్గ్ ఏవియేషన్‌కు చెందిన ఒక శిక్షణ విమానం గురువారం మధ్యాహ్నం హఠాత్తుగా కుప్పకూలిపోయింది (Kanpur Aircraft Crash). ఈ ప్రమాదం జరిగిన సమయంలో విమానంలో ఒక ఇన్‌స్ట్రక్టర్ (పైలట్), ఒక ట్రైనీ పైలట్ ఉన్నారు.
ప్రమాద తీవ్రత కారణంగా విమానం ధ్వంసం కాగా, ప్రమాదంలో పైలట్, కో-పైలట్ ఇద్దరూ మరణించినట్లు సమాచారం వెలువడుతోంది. సమాచారం అందుకున్న వెంటనే సహాయక బృందాలు, పోలీస్ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని రక్షణ చర్యలు ప్రారంభించారు. ఈ ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలు ఇంకా తెలియాల్సి ఉందని, ఘటనపై అధికారులు విచారణ జరుపుతున్నారు.

