కలం, నిజామాబాద్ బ్యూరో: రాజీవ్ జ్యోతి సద్భావన యాత్ర (Rajiv Jyoti Sadbhavana Yatra) అధ్యక్షులు దొరాయ్ వేలు ఆధ్వర్యంలో పెరంబదూర్ నుండి ఢిల్లీ వరకు కొనసాగే 35వ రాజీవ్ జ్యోతి సద్భావన యాత్ర శుక్రవారం నిజామాబాద్ (Nizamabad)కు చేరుకుంది. ఈ సందర్భంగా డిసిసి ఇంచార్జ్ కౌడపు శరత్ కుమార్, డిసిసి కార్పొరేషన్ అధ్యక్షులు బొబ్బిలి రామకృష్ణ కాంగ్రెస్ భవన్ వద్ద ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి ఆయన సేవలను స్మరించుకుంటూ నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా బొబ్బిలి రామకృష్ణ మాట్లాడుతూ రాజీవ్ జ్యోతి యాత్ర దేశంలో శాంతిని పెంపొందించే విధంగా 35 సంవత్సరాల క్రితం మొదలు పెట్టి ముందుకు వెళ్తుందని, ఆగస్టు 9వ తేదీన క్విట్ ఇండియా మూమెంట్ రోజు ప్రారంభమైన యాత్ర క్విట్ టెర్రరిస్ట్ నినాదంతో ముందుకు వెళ్తుందన్నారు. ఆగస్టు 20న ఢిల్లీ చేరుకొని అక్కడ ముగుస్తుందన్నారు. రాజీవ్ గాంధీ దేశానికి చేసిన సేవలను స్మరించుకుంటూ ఈ యాత్ర ముందుకు సాగుతోందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కోశాధికారి భక్తవస్తలం, ఏఐసీసీ కోఆర్డినేటర్ గన్ రాజ్, జిల్లా యూత్ అధ్యక్షులు విపుల్ గౌడ్, మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ రాజేంద్ర ప్రసాద్, జెండా గుడి ఛైర్మన్ లవంగ ప్రమోద్, మాజీ కార్పొరేటర్ కుడ్డుస్, బంటు బలరామ్, మహిళా కాంగ్రెస్ నాయకులు పోల ఉష, అపర్ణ, ఆకుల మహేందర్, జాఫర్, రాజ్ గగన్, సుమీర్ అహ్మద్, తదితరులు పాల్గొన్నారు.

