తిరుమల శ్రీవారి సేవలో ఏపీ మంత్రి లోకేశ్​, సింగపూర్ మంత్రి షణ్ముగం

కలం, వెబ్ డెస్క్: కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల (Tirumala) శ్రీ వేంకటేశ్వర స్వామివారిని ఏపీ మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh)​, సింగపూర్ మంత్రి షణ్ముగం (Shanmugam) తో కలిసి దర్శించుకున్నారు. మంగళవారం తెల్లవారుజూమున వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ద్వారా ఆలయంలోకి వెళ్లిన లోకేశ్​ షణ్ముగంతో కలిసి శ్రీవారి సుప్రభాత సేవ, తోమాల సేవ, అర్చన సేవల్లో పాల్గొన్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనాలు అందించగా.. ఆలయ ఈవో రవిచంద్ర, అదనపు ఈవో వెంకయ్య చౌదరి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>