Mobile Popup Ad
Mobile Popup Ad

‘జైలర్ 2’ రిలీజ్ డేట్‌కు రంగం సిద్ధం.. నేడు బిగ్ అప్డేట్

కలం, సినిమా : సూపర్‌స్టార్ రజనీకాంత్ (Rajinikanth) అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ‘జైలర్ 2′(Jailer2)సినిమా నుంచి నేడు బిగ్  అప్‌డేట్ రానుంది. తాజాగా చిత్ర యూనిట్, ‘టైగర్ ముత్తువేల్ పాండియన్ ఈజ్ బ్యాక్!’ అంటూ విడుదల చేసిన పోస్టర్ అభిమానులలో ఉత్సాహాన్ని రెట్టింపు చేసింది.  ‘జైలర్ 2’ విడుదల తేదీని ఈరోజే అధికారికంగా ప్రకటించనున్నట్లు మేకర్స్ వెల్లడించారు. దీంతో సోషల్ మీడియాలో ఈ సినిమా హ్యాష్‌ట్యాగ్‌లు ట్రెండ్ అవుతుండగా, రజనీకాంత్ అభిమానులు బిగ్ అప్‌డేట్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

దర్శకుడు నెల్సన్ దిలీప్‌కుమార్ (Nelson Dilipkumar) తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి మరోసారి యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ (Anirudh) సంగీతాన్ని అందిస్తున్నారు. భారీ అంచనాల మధ్య రూపొందుతున్న ఈ సీక్వెల్‌లో రజనీకాంత్ మరోసారి తన పవర్‌ఫుల్ పాత్ర ‘టైగర్ ముత్తువేల్ పాండియన్‌’ గా ప్రేక్షకులను అలరించనున్నారు. 2023లో విడుదలైన ‘జైలర్’ మూవీ బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని నమోదు చేయడంతో, దాని సీక్వెల్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. నేడు సాయంత్రం 6 గంటలకు ‘జైలర్ 2’ రిలీజ్ డేట్ అనౌన్స్‌మెంట్‌తో పాటు ప్రత్యేక వీడియో లేదా పోస్టర్ కూడా విడుదలయ్యే అవకాశం ఉందని తెలుస్తుంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>