కలం, స్పోర్ట్స్ : టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ (Gautam Gambhir) కోసం ఐపీఎల్ ఫ్రాంచైజీలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి. వాటిలో రాజస్థాన్ రాయల్స్ కూడా ఉంది. రాజస్థాన్ అన్నిటికన్నా కష్టపడుతుందనే చెప్పాలి. గంభీర్ ను తమ టీమ్ మెంటార్, సీఈఓ, పార్ట్‌నర్‌గా తీసుకురావడానికి శత విధాలా ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. కొత్త యాజమాన్యం దిశగా అడుగులు వేస్తున్న రాజస్థాన్, ఇప్పటికే రియాన్ పరాగ్‌ను కెప్టెన్‌గా ప్రకటించింది. ఫ్రాంచైజీ భవిష్యత్ ప్రణాళికలపై గంభీర్‌కు దీర్ఘకాలిక ప్రతిపాదన పంపినట్టు సమాచారం.
గత సీజన్ ఫలితాల తర్వాత టీమ్ మేనేజ్‌మెంట్ కీలక మార్పులు చేపట్టింది. రాహుల్ ద్రవిడ్ రీటర్న్ ఒక్క సీజన్‌కే పరిమితమైంది. ఆపై కుమార సంగక్కర మళ్లీ సెటప్‌లోకి వచ్చారు. సపోర్ట్ స్టాఫ్‌లో విక్రమ్ రాథోర్, షేన్ బాండ్, ట్రెవర్ పెన్ని చేరారు. అయితే, ప్రస్తుతం గంభీర్ భారత జట్టు బాధ్యతల్లో ఉన్నారు. ఆయన 2024లో హెడ్ కోచ్‌గా బాధ్యతలు స్వీకరించి, 2027 వన్డే వరల్డ్ కప్ వరకూ బీసీసీఐతో ఒప్పందం చేసుకున్నారు. లోధా కమిటీ మార్గదర్శకాల ప్రకారం, భారత కోచ్‌గా కొనసాగుతూ ఐపీఎల్ ఫ్రాంచైజీలో కీలక పాత్ర పోషించడం సాధ్యం కాదని నివేదికలు చెబుతున్నాయి. భారత జట్టు బాధ్యతలు తీసుకున్న సమయంలో గంభీర్ (Gautam Gambhir).. కోల్‌కతా నైట్ రైడర్స్(KKR) మెంటార్ పదవిని వదిలేశారు. మరి ఈ విషయంలో ఆర్ఆర్ అదృష్టం ఎంతవరకనేది చూడాలి.
Read Also: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న USA క్రికెటర్లు
Follow Us On: Sharechat


