Mobile Popup Ad
Mobile Popup Ad

రాజ‌మండ్రి క‌ల్తీ పాల ఘ‌ట‌న‌లో మ‌రో ఇద్ద‌రు మృతి!

క‌లం, వెబ్ డెస్క్‌: తూర్పు గోదావ‌రి జిల్లా రాజ‌మండ్రి(Rajahmundry)లో జ‌రిగిన‌ క‌ల్తీ పాల (Adulterated Milk) ఘ‌ట‌న‌లో రోజురోజుకీ మృతుల సంఖ్య పెరుగుతోంది. తాజాగా మ‌రో ఇద్ద‌రు ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 16కు చేరుకుంది. క‌ల్తీ పాలు తాగి మొత్తం 20 మందికి పైగా ఆస్ప‌త్రి పాల‌య్యారు. వీరంద‌రికీ కిడ్నీ సంబంధిత స‌మ‌స్య‌లు ఉన్న‌ట్లు వైద్యులు ధృవీక‌రించారు. ఈ క్ర‌మంలో చికిత్స పొందుతూ దాదాపు 16 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో వృద్ధుల‌తో పాటు చిన్న పిల్లలు కూడా ఉన్నారు. తాజాగా కిమ్స్ బొల్లినేని ఆస్పత్రిలో కడలి కృష్ణారావు (75), డెల్టా ఆస్పత్రిలో రెడ్డి అనంతలక్ష్మి (55) మృతి చెందారు. ఈ ఘ‌ట‌న‌కు సంబంధించి మ‌రో ఐదుగురికి ఆస్ప‌త్రిలో చికిత్స కొన‌సాగుతోంది. వీరి ప‌రిస్థితి కూడా విష‌మంగా ఉన్న‌ట్లు వైద్యులు వెల్ల‌డించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>