Mobile Popup Ad
Mobile Popup Ad

సంగారెడ్డిలో దారుణం.. వాచ్‌మెన్ దంప‌తుల హ‌త్య‌!

క‌లం, వెబ్ డెస్క్‌: సంగారెడ్డి (Sangareddy) జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. వాచ్‌మెన్ దంప‌తుల‌ (Watchman Couple)ను గుర్తు తెలియ‌ని వ్య‌క్తులు హ‌త్య చేశారు. వివ‌రాల్లోకి వెళ్తే… మహబూబ్ నగర్ జిల్లా గూడూరు మండలంలోని దొంగచింత తండాకు చెందిన ధరావత్ సోములు త‌న భార్య మంగ‌మ్మ‌తో క‌లిసి ఇంద్రేశం (Indresham)లో వాచ్‌మెన్‌గా ప‌ని చేస్తున్నాడు. ప‌ని చేస్తున్న చోటే వీరు చిన్న గుడిసెలో నివాసం ఉంటున్నారు. శుక్ర‌వారం రాత్రి భార్యాభ‌ర్త‌లిద్ద‌రిని గుర్తు తెలియ‌ని వ్య‌క్తులు రాడ్డుతో కొట్టి హత్య చేశారు. స్థానికుల ద్వారా స‌మాచారం అందుకున్న పోలీసులు ఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకున్నారు. కేసు న‌మోదు చేసుకొని ద‌ర్యాప్తు చేప‌ట్టారు. పోలీసులు దంప‌తుల కుటుంబ‌స‌భ్యుల‌కు స‌మాచారం అందించ‌డంతో వారు ఇంద్రేశం చేరుకున్నారు. ప‌ని కోసం వ‌చ్చి ప్రాణాలు పోగొట్టుకున్నారంటూ క‌న్నీరుమున్నీరుగా విల‌పిస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>