Mobile Popup Ad
Mobile Popup Ad

జనసేన ఆవిర్భావ దినోత్సవం.. స్పెషల్ వీడియో వైరల్​

కలం, వెబ్ డెస్క్: జనసేన పార్టీ (JanaSena) 13వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్రవ్యాప్తంగా పార్టీ శ్రేణులు ఘనంగా వేడుకలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంలో పార్టీ ప్రత్యేక వీడియోను విడుదల చేసింది. డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్​ కళ్యాణ్​ ఈ రోజు పాడేరు నియోజకవర్గంలోని నందిగరువులో గిరిజనుల మధ్య వేడుకల్లో పాల్గొననున్నారు. కార్యక్రమానికి ముందు ఓనూరు జంక్షన్ వద్ద పార్టీ పతాకాన్ని ఆయన ఆవిష్కరించనున్నారు.

కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధాన్ మంత్రి జానజాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్, మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం పథకాల నిధులతో ఏజెన్సీ ప్రాంతంలో చేపట్టిన రహదారి నిర్మాణ పనులను పవన్ కళ్యాణ్ పరిశీలించనున్నారు. అలాగే అడవితల్లి బాట కార్యక్రమంలో నిర్మించిన రోడ్లను ప్రారంభించనున్నారు. తరువాత నందిగరువులో గిరిజనులతో సమావేశమై వారి సమస్యలను తెలుసుకునే మాటామంతి కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఈ సందర్భంలో ఏజెన్సీ ప్రాంతాల అభివృద్ధి, భవిష్యత్ కార్యాచరణపై పవన్ కళ్యాణ్ ప్రసంగిస్తారని భావిస్తున్నారు.

పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించి విడుదల చేసిన ప్రత్యేక వీడియో సోషల్ మీడియాలో వైరల్​ అవుతోంది. జనసేన (JanaSena) ప్రయాణాన్ని ప్రతిబింబించే ఈ వీడియోకు పార్టీ శ్రేణులు, అభిమానులు మంచి స్పందన లభిస్తోంది. ఈ వీడియోలో పార్టీ స్థాపన నుంచి ఇప్పటి వరకు సాధించిన విజయాలు, ప్రజల సమస్యల పరిష్కారంలో చేసిన పోరాటాలను వివరంగా చూపించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>