కలం డెస్క్: రైల్వే డిపార్టుమెంట్ (Railway Department) ప్రయాణికులకు షాకింగ్ న్యూస్ చెప్పింది. ఇక నుంచి రైళ్లలో అధిక లగేజీపై ఛార్జీలు విధించేలాగా రైల్వేశాఖ నిర్ణయం తీసుకుంది. ఏసీ స్లీపర్ త్రీ టైర్ లో 40 కేజీల దాకానే ఇక నుంచి అనుమతిస్తారు. జనరల్ బోగీల్లో 35 కిలోల వరకు ఉచితంగా తీసుకెళ్లొచ్చు. ఏసీ ఫస్ట్ క్లాస్ లో 70 కిలోల దాకా తీసుకెళ్లాలి. అంతకు మించి లగేజీ ఉంటే వాటికి ఛార్జీలు చెల్లించాల్సిందే. దీంతో పాటు మరో నిర్ణయం కూడా తీసుకుంది రైల్వేశాఖ. ఇప్పటి వరకు ప్రతి రైలు బయలుదేరడానికి 4 గంటల ముందు చార్ట్ తయారు చేస్తున్నారు. ఇక నుంచి రైలు బయలుదేరడానికి 10 గంటల ముందే చార్ట్ తయారు చేయాల్సి ఉంటుంది. దీని వల్ల రైళ్ల రాకపోకల్లో సమస్యలను తగ్గించే అవకాశాలు ఉంటాయి. అలాగే ప్రయాణికులు కూడా 10 గంటల ముందే టికెట్ స్టేటస్ ను తెలుసుకోవచ్చు. ఒకవేళ ట్రైన్ లో టికెట్లు అవైలేబుల్ లేకపోతే వేరే ట్రైన్ ను ఎంచుకునే ఛాన్స్ ఉంటుంది.
Read Also: మెస్సీకి అంబానీ ఇచ్చిన గిఫ్ట్ వాచ్ రేటెంతో తెలుసా?


