కలం, వెబ్ డెస్క్ : బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే (Nishikant Dubey) తన పార్లమెంట్ సభ్యత్వాన్ని రద్దు చేయాలని కోరుతూ ఇచ్చిన నోటీసులపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) స్పందించారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా ఒక వీడియోను విడుదల చేస్తూ కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. తనపై ఎన్ని కేసులు పెట్టినా, ఎఫ్ఐఆర్లు నమోదు చేసినా, లేదా ప్రివిలేజ్ నోటీసులు ఇచ్చినా భయపడే ప్రసక్తే లేదని ఆయన అన్నారు. రైతుల ప్రయోజనాల కోసం తన పోరాటం నిరంతరం కొనసాగుతుందని రాహుల్ గాంధీ పేర్కొన్నారు.
దేశ ఆహార భద్రతను బలహీనపరిచేలా ఉన్నా, రైతుల జీవనోపాధిని దెబ్బతీసే ఏ రకమైన వాణిజ్య ఒప్పందాలనైనా రైతు వ్యతిరేకమైనవిగానే పరిగణించాలని ఆయన తెలిపారు. అన్నదాతల హక్కుల విషయంలో నరేంద్ర మోదీ ప్రభుత్వంతో రాజీ పడేది లేదని ఆయన చెప్పారు. రైతుల సంక్షేమం కోసం ఎంతటి ఒత్తిడినైనా ఎదుర్కొంటానని రాహుల్ గాంధీ (Rahul Gandhi) పేర్కొన్నారు.
Read Also: హైస్పీడ్ కారిడార్ల అలైన్‌మెంట్లకు సీఎం సూచనలు..
Follow Us On: X(Twitter)


