epaper
Wednesday, February 18, 2026
epaper

ఫ్లయింగ్ కార్ వచ్చేసింది.. ఇక రోడ్లపైనే కాదు, ఆకాశంలోనూ షికారే!

కలం, వెబ్ డెస్క్: టెక్నాలజీలో ఎప్పుడు ముందుండే చైనా (China) మరో ప్రయోగం చేసి మెస్మరైజ్ చేసింది. చైనాలోని చోంగ్‌కింగ్‌లో మొట్టమొదటి అంతరిక్ష పరిశోధన ఆధారిత ‘ఫ్లయింగ్ కార్’ (Flying Car) విజయవంతంగా గాలిలోకి ఎగిరింది. విమానం, కారు ఫీచర్లను కలిపి రూపొందించిన వాహనం రోడ్డు మీద ప్రయాణిస్తూనే.. అవసరమైనప్పుడు ఆకాశంలోకి ఎగురుతుంది. గాలిలో గంటకు 150 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగల ఈ వాహనం ఇద్దరిని తీసుకెళ్లగలదు. అలాగే ఎలక్ట్రిక్ మోడ్‌లో ఒకసారి ఛార్జ్ చేస్తే భూమిపై 300 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు.

నిపుణుల అంచనా ప్రకారం.. 2026లో చైనా ఎగిరే కార్ల (Flying Car) చరిత్రలో కీలకం కానుంది. ఈ ఏడాది చివరి నాటికి సుమారు ఏడు కంపెనీలు తమ ఫ్లయింగ్ కార్లను డెలివరీ చేసే అవకాశం ఉంది. భవిష్యత్తులో ఈ తరహా ప్రయాణం కార్ టాక్సీ ఖర్చులతో సమానంగా ఉండవచ్చనని తెలిపింది. రాబోయే మూడేళ్లలో అందరికీ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని కంపెనీ ప్రతినిధులు భావిస్తున్నారు.

అలాగే చైనాకు చెందిన ఆటోఫ్లైట్ అనే స్టార్టప్ సంస్థ కూడా ఈ రంగంలో వేగంగా అడుగులు వేస్తోంది. వీరు రూపొందించిన ‘V5000 మ్యాట్రిక్స్’ అనే విమానం సుమారు 10 మంది ప్రయాణికులను, భారీ సరుకులను తీసుకెళ్తుంది. చైనా ప్రభుత్వం 2027 నాటికి ఈ రకమైన విమాన ప్రయాణాలను అందుబాటులోకి తెచ్చేందుకు సిద్ధమవుతోంది.

 Read Also: టీ20 వరల్డ్​ కప్​: మెరిసిన ఇషాన్​, హార్థిక్​.. భారత్​ ఘన విజయం

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>