Mobile Popup Ad
Mobile Popup Ad

మనం ఎక్కడ చమురు కొనాలో అమెరికా చెప్పడమేంటి : రాహుల్ గాంధీ

కలం, డెస్క్ : భారత్ ఎక్కడ చమురు కొనాలో అమెరికా చెప్పడమేంటని ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ  (Rahul Gandhi) ఆగ్రహం వ్యక్తం చేశారు. అమెరికాతో ట్రేడ్ డీల్ (US Trade Deal) వల్ల భారత్ కు ఉపయోగం ఏమీ లేదని.. అమెరికాకే మేలు జరుగుతుందని విమర్శించారు. ‘అమెరికా నుంచి చమురు కొనాలని.. లేదంటే భారత్ మీద 50 శాతం టారిఫ్ లు వేస్తామని బెదిరిస్తోంది. అమెరికా బెదిరింపులకు తలొగ్గితే భారత్ కు పెద్ద నష్టం జరుగుతుంది. మన వ్యవసాయ ఉత్పత్తులకు డిమాండ్ తగ్గుతుంది. అమెరికా నుంచి చమురు కొంటే మన ఆయిల్ కంపెనీలకు చాలా నష్టం. భారత్ మీద ఒకప్పుడు 3 శాతం పన్నులు ఉంటే.. దాన్ని ఇప్పుడు 18 శాతానికి పెంచారు.

కానీ అమెరికా దిగుమతులను మన దేశంలో 46 బిలియన్ డాలర్ల నుంచి 100 బిలియన్ డాలర్లకు పెంచేశారు. దీని వల్ల అమెరికా ఆర్థికంగా బలపడుతుంది. కానీ ఇండియా ఆర్థిక వ్యవస్థకు (India Economy) మరింత నష్టమే’ అంటూ రాహుల్ గాంధీ (Rahul Gandhi) తీవ్ర స్థాయిలో విమర్శించారు.

Read Also: ‘వందేమాతరం’పై కేంద్రం కీలక నిర్ణయం

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>