epaper
Wednesday, February 18, 2026
epaper

‘వందేమాతరం’పై కేంద్రం కీలక నిర్ణయం

క‌లం, వెబ్ డెస్క్‌: జాతీయ గేయం ‘వందేమాతరం'(Vande Mataram)పై భారత ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై వందేమాతరం ఎక్క‌డ పాడినా, వినిపించినా మొత్తం ఆరు చ‌ర‌ణాల‌ను క‌లిపి పాడాల‌ని ఉత్త‌ర్వులు జారీ చేసింది. రాష్ట్రప‌తికి సంబంధించిన కార్య‌క్ర‌మాలు మొద‌లుకొని అన్ని ప్ర‌భుత్వ‌ అధికారిక కార్యక్రమాల్లో వందేమాతరం గేయాన్ని తప్పనిసరి చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఇప్ప‌టి వ‌ర‌కు పాఠ‌శాల‌ల్లో వందేమాత‌రం మొద‌టి రెండు చ‌ర‌ణాల‌ను మాత్ర‌మే పాడేవారు. అయితే ఇక‌పై ఆరు చ‌ర‌ణాలు పాడుతూ, భ‌విష్య‌త్తు త‌రాల‌కు ఈ గేయంపై గౌర‌వం పెంచేందుకు ప్ర‌భుత్వం ఈ నిర్ణ‌యం తీసుకుంది.

వందేమాతం (Vande Mataram) పాడే ప్ర‌తి చోటా ఆరు చరణాలు తప్పనిసరిగా వాడుకలో ఉండేలా చూడాలని రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసింది. వందేమాత‌రం పాడేట‌ప్పుడు ప్ర‌తి ఒక్క‌రూ గౌర‌వ సూచ‌కంగా నిల్చోవాల‌ని, గేయాన్ని ఆల‌పించేట‌ప్పుడు ఇత‌రుల‌ను ఇబ్బందిపెడితే చ‌ట్ట‌ప‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని సూచించింది. అన్నింటి కంటే ముఖ్యంగా ఇక నుంచి జాతీయ గీతం జ‌న‌గ‌ణ మ‌న కంటే ముందుగా వందేమాత‌రం ఆల‌పించాల్సి ఉంటుంది. వందేమాత‌రం ఆరు చ‌ర‌ణాల‌ను 3 నిమిషాల 10 సెక‌న్ల వ్య‌వ‌ధిలో పూర్తి చేయాల్సి ఉంటుంది.

 Read Also: సంగారెడ్డిలో తీవ్ర ఉద్రిక్తత.. జగ్గారెడ్డి, పోలీసులకు మధ్య వాగ్వివాదం

Follow Us On: Sharechat

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>