‘నిన్ను చూసి గర్వపడుతున్నా’.. రాహుల్ గాంధీ ఎమోషనల్

కలం, వెబ్ డెస్క్: కాంగ్రెస్ అగ్ర నేత సోనియా గాంధీ జీవిత చరిత్ర “బి లాంగింగ్: ఏ జర్నీ ఆఫ్ లవ్” పుస్తకం ఈ రోజు విడుదలైంది. ఈ నేపథ్యంలో ఆమె కుమారుడు, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. ‘అమ్మా.. నిన్ను నాన్నతో కలిసి 35 ఏళ్ల కిందట చూశాను. ఆయన మనల్ని వదిలిపెట్టి పోయినా ఎన్నడూ ధైర్యాన్ని కోల్పోలేదు, గౌరవాన్ని తగ్గించుకోలేదు. నాన్న మరణం తరువాత నీ జీవితంలో ఎన్ని కష్టాలు పడ్డావో నాకు, ప్రియాంకకు మాత్రమే తెలుసు. నిన్ను చూసి గర్వపడుతున్నా’ అని తెలిపారు.

‘ఈ రోజు నిన్ను ఎంతగానో ప్రేమించే లక్షలాది మంది నువ్వు రాసిన పుస్తకాన్ని చదివే అవకాశం వచ్చింది. వ్యక్తిగత విషయాలను ఎవరితో పంచుకోని నువ్వు.. ఇప్పుడు అందమైన కథను అందరికీ చెప్పడం కొంత కష్టమైన పనే. ఈ రోజు నాన్న వర్ధంతి. పై నుంచి తన సోనియాని చూస్తూ ఆయన గర్వపడుతుంటారు’ అని రాహుల్ పేర్కొన్నారు.

ఇటలీ నుంచి ఇండియా వరకు..

రాజీవ్ గాంధీ హత్య అనంతరం భారత రాజకీయాల్లో కీలక పాత్ర పోషించిన సోనియా గాంధీ జీవిత చరిత్ర పుస్తక రూపంలో రావడంతో ఆసక్తి నెలకొంది. దీనిలో ఇటలీలో తన కుటుంబ నేపథ్యం, రాజీవ్ గాంధీతో పరిచయం, ప్రేమ, పెళ్లి, రాజీవ్ ప్రధాని అయిన తరువాత, మరణించిన తరువాత పార్టీ, ప్రభుత్వం నడపడటంలో ఎదురైన సవాళ్ల వంటి ఎన్నో విశేషాలను పొందుపరిచారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>