కలం, వెబ్ డెస్క్ : కల్యాణలక్షి, షాదీముబారక్ పథకాలపై తెలంగాణ హైకోర్టు (TG High Court) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఉచిత పథకాలపై న్యాయస్థానంలో కీలక చర్చ సాగింది. కల్యాణలక్షి, షాదీముబారక్ పథకాలను నిలిపివేయాలని పిటిషన్ దాఖలైంది. దీంతో ఈ రెండు పథకాలపై న్యాయస్థానం స్టే విధించింది.
ఈ క్రమంలో తెలంగాణ ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేసింది. స్టే ఎత్తివేయాలని కోరుతూ న్యాయస్థానానికి విన్నపం చేసింది. ప్రభుత్వం వేసిన పిటిషన్ విచారించిన హైకోర్టు ఉచిత పథకాలపై తీవ్ర వ్యాఖ్యలు చేసింది. జీతాలు, పెన్షన్లు రాక అనేకమంది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని న్యాయస్థానం తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. స్టేను తొలగించే ప్రస్తక్తే లేదని తేల్చి చెప్పింది.
కల్యాణలక్ష్మి, షాదీముబారక్ లాంటి పథకాలకు చట్టబద్ధత ఏంటని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి ప్రమాద స్థితికి చేరుకుందని హెచ్చరించింది. ప్రజాధనాన్ని ఉచిత పథకాల కోసం వినియోగించకుండా.. ప్రభుత్వ రంగంలోని సంస్థలను లాభాల్లోకి తీసుకురావాలసి హైకోర్టు సూచించింది.

