కలం, వెబ్ డెస్క్ : ఓట్ చోరీపై కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో ఏర్పాటు చేసిన ప్రత్యేక మీడియా సమావేశంలో ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా ఎలక్షన్ కమిషనర్లపై రాహుల్ సంచలన ఆరోపణలు చేశారు. ఓట్ చోరీ గురించి ఎన్నికల కమిషనర్లకు తెలుసు అని చెప్పారు. 2024 లోక్ సభ ఎన్నికల్లో ఓట్ చోరీ జరిగింది అని ఆయన ఆరోపించారు.
ఓటు చోరీ జరిగినట్లు తమ దగ్గర ఆధారాలు ఉన్నాయని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. బీజేపీ మీద ప్రభుత్వ వ్యతిరేక ప్రభావం ఎందుకు లేదని ఆయన ప్రశ్నించారు. ఓటును కాపాడడం ఎన్నికల సంఘం బాధ్యత.. కానీ, 2024 లోక్ సభ ఎన్నికల్లో ఎన్నికల సంఘం బీజేపీ మద్దతు తెలిపిందన్నారు. ఓట్ చోరీకి సహకరించిన కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్ జ్ఙానేష్ కుమార్ (Gyanesh Kumar) రాజీనామా చేయాల్సిందేనని రాహుల్ డిమాండ్ చేశారు.
ప్రభుత్వ వ్యతిరేకత అకస్మాత్తుగా ఎలా మాయమైందో ప్రశ్నార్ధకమైందన్నారు. హర్యానాలో 50 ఏళ్లుగా పార్టీలు మారుతూ అధికారంలోకి వచ్చాయని.. ఉత్తరప్రదేశ్‌లోనూ ఇదే తరహా పరిస్థితి కొనసాగిందన్నారు. గుజరాత్, మహారాష్ట్రలోనూ ఇదే తరహా మార్పులు జరిగాయని రాహుల్ గుర్తు చేశారు. బంగ్లాదేశ్ విముక్తి యుద్ధంతో ఇందిరాగాంధీ ప్రతిష్ట పెరిగిందని రాహుల్ గాంధీ (Rahul Gandhi) చెప్పుకొచ్చారు.
Also Read: బల్మూరి వెంకట్‌పై NSUI స్టేట్ ప్రెసిడెంట్ ఫిర్యాదు!
Follow Us On : WhatsApp

