బ‌ల్మూరి వెంక‌ట్‌పై NSUI స్టేట్ ప్రెసిడెంట్ ఫిర్యాదు!

క‌లం, వెబ్‌డెస్క్‌: కాంగ్రెస్ ఎమ్మెల్సీ బ‌ల్మూరి వెంక‌ట్‌ (Balmoor Venkat)పై ఎన్ఎస్‌యూఐ (NSUI) స్టేట్ ప్రెసిడెంట్ య‌డ‌వ‌ల్లి వెంక‌ట్ స్వామి (Yadavalli Venkataswamy) తీవ్ర ఆరోప‌ణ‌లు చేశారు. అగ్ర‌కుల అహంకారంతో వెంక‌ట్ త‌న‌పై వివ‌క్ష చూపిస్తున్నార‌ని కాంగ్రెస్‌ అధిష్టానానికి లేఖ ద్వారా ఫిర్యాదు చేశారు. ఏళ్ల త‌ర‌బ‌డి విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం ఎప్పుడూ ముందుంటూ పోరాడాన‌ని, అలాంటి త‌న‌పైనే ఇప్పుడు కొంద‌రు కుట్ర‌లు చేస్తున్నార‌ని ఆరోపించారు.

బ‌ల్మూరి వెంక‌ట్ పేరు ప్ర‌స్తావించ‌కుండా ఎన్ఎస్‌యూఐ మాజీ రాష్ట్ర నాయ‌కుడు త‌న‌ను, త‌న క‌మిటీని నిరంత‌రం వివ‌క్ష‌కు గురి చేస్తున్నాడ‌ని మండిప‌డ్డారు. పార్టీ పెద్ద‌లు తాను ప‌డ్డ క‌ష్టాన్ని గుర్తించి, త‌న‌కు ప‌ద‌వి ఇచ్చార‌ని గుర్తు చేశారు. విద్యార్థుల కోసం పని చేసే అవకాశాన్ని కల్పించిన కాంగ్రెస్ అగ్రనేతలు మల్లికార్జున ఖర్గే, కన్హయ్య కుమార్, వినోద్ ఝాకర్‌తో పాటు రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థుల సమస్యలపై ఉద్యమాలు నిర్వహిస్తూ, నిరంతరం పోరాడే అవకాశం లభించడం తనకు గౌరవంగా భావిస్తున్నానని పేర్కొన్నారు.

రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసిన కాలంలో కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలను విద్యార్థుల్లోకి తీసుకెళ్లేందుకు కృషి చేశానని వెంకట్ స్వామి (Yadavalli Venkataswamy) తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా అనేక ఆందోళనలు, నిరసనలు, కార్యక్రమాలు నిర్వహించి విద్యార్థుల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లినట్లు పేర్కొన్నారు. తాను ప‌ద‌వి చేప‌ట్టిన‌ప్ప‌టి నుంచి ఎన్ఎస్‌యూఐలో కొంద‌రు వ్య‌క్తులు త‌న‌కు వ్య‌తిరేకంగా దుష్ప్ర‌చారం చేస్తున్నార‌న్నారు. అగ్ర‌కుల యువ‌త‌ను రెచ్చ‌గొట్టి త‌న‌కు వ్య‌తిరేకంగా ప‌ని చేసేలా ప్రోత్స‌హించార‌ని ఆరోపించారు. తాను జిల్లా క‌మిటీలు ఏర్పాటు చేసుకోకుండా అడ్డుకున్నార‌ని మండిప‌డ్డారు.

ఇప్పుడు త‌న ప‌ద‌వీ కాలం ముగియ‌క‌ముందే కొన్ని సాకుల‌తో త‌నను ప‌ద‌వి నుంచి తొల‌గించే కుట్ర చేస్తున్నార‌ని ఆరోపించారు. ఏళ్ల త‌ర‌బ‌డి త‌న‌పై జ‌రుగుతున్న అగ్ర కుల వివ‌క్ష‌, కొంద‌రి నిజ‌స్వ‌రూప‌రాలు పార్టీ దృష్టికి తీసుకురావాల‌నే ఈ లేఖ రాస్తున్న‌ట్లు వెల్ల‌డించారు. ఈ ఫిర్యాదుతో త‌న ప‌ద‌వి పోతుంద‌న్న బాధ త‌న‌కు లేద‌ని, విద్యార్థుల సంక్షేమం కోసం తన పోరాటం కొనసాగుతుందని తెలిపారు. పార్టీ బలోపేతానికి సాధారణ కార్యకర్తగా కూడా అంకితభావంతో పని చేస్తానని స్పష్టం చేశారు.

Also Read : మరో భారీ ఉద్యమానికి సీజేపీ ప్లాన్​.. ఈ సారి టార్గెట్​ ఎవరంటే..!

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>