epaper
Wednesday, February 18, 2026
epaper

నరవణే పుస్తకం.. రాహుల్ సంచలన వ్యాఖ్యలు

కలం, వెబ్​ డెస్క్​ : మాజీ ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎం నరవణే రాసిన పుస్తకం ప్రచురణ కాకుండా ప్రభుత్వం అడ్డుకుంటోందని రాహుల్ గాంధీ (Rahul Gandhi) ఆరోపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నరవణే తన ఎక్స్ ఖాతాలో తన పుస్తకం అందుబాటులోకి వచ్చిందని, ఒక లింక్ ద్వారా చదవమని పోస్ట్ చేశారని పేర్కొన్నారు. అయితే మరోవైపు పెంగ్విన్ పబ్లికేషన్స్ మాత్రం ఆ పుస్తకం ఇంకా విడుదల కాలేదని చెబుతోందని, ఇక్కడ ఎవరో ఒకరు అబద్ధం చెబుతున్నారని రాహుల్ అన్నారు. తాను మాత్రం మాజీ ఆర్మీ చీఫ్ మాటలనే నమ్ముతానని ఆయన తెలిపారు.

ప్రభుత్వానికి ఇబ్బంది కలిగించే అంశాలు ఆ పుస్తకంలో ఉన్నందునే దానిని బయటకు రాకుండా చేస్తున్నారని రాహుల్ (Rahul Gandhi) ఆరోపించారు. ముఖ్యంగా 2020 నాటి భారత్-చైనా సరిహద్దు వివాదం సమయంలో ప్రధాని మోదీ తన బాధ్యతలను సరిగ్గా నిర్వర్తించలేదని, ఆ సమయంలో ఆర్మీ చీఫ్ ఒంటరిగా పోరాడాల్సి వచ్చిందని ఈ పుస్తకం ద్వారా తెలుస్తోందని అన్నారు. ఈ అంశంపై చర్చకు ప్రభుత్వం భయపడుతోందని, అందుకే తనను సభలో మాట్లాడనీయకుండా అడ్డుకుంటున్నారని పేర్కొన్నారు.

ప్రస్తుతం ఈ పుస్తకానికి సంబంధించిన పిడిఎఫ్ ప్రతులు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో ఢిల్లీ పోలీసులు దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు ఈ వివాదం కారణంగా పార్లమెంట్ కార్యకలాపాలకు ఆటంకం కలిగించినందుకు ఎనిమిది మంది ప్రతిపక్ష ఎంపీలపై సస్పెన్షన్ వేటు పడింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>