గాజులరామారంలో తీవ్ర ఉద్రిక్తత: అక్రమ నిర్మాణాల కూల్చివేత!

కలం, వెబ్ డెస్క్ : హైదరాబాద్‌లోని గాజులరామారం (Gajularamaram) ప్రాంతంలో భారీ ఎత్తున అక్రమ నిర్మాణాల కూల్చివేతలు చేపట్టారు. ప్రభుత్వ స్థలాల్లో, ముఖ్యంగా దిల్ సంస్థకు కేటాయించిన సర్వే నంబర్ 49 పరిధిలోని భూముల్లో అక్రమంగా వెలిసిన పారిశ్రామిక షెడ్లు, దుకాణాలను రెవెన్యూ అధికారులు జేసీబీలతో నేలమట్టం చేశారు. నివాస గృహాలను వదిలివేసి, కేవలం వాణిజ్య అవసరాల కోసం నిర్మించిన సముదాయాలపైనే అధికారులు ఈ చర్యలు తీసుకున్నట్లు చెబుతున్నారు. ఈ కూల్చివేత పనులను స్థానికులు, బాధితులు తీవ్రంగా వ్యతిరేకించారు.

అధికారుల చర్యను అడ్డుకునేందుకు వారు పెద్ద ఎత్తున ప్రయత్నించడంతో అక్కడ ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. రంగంలోకి దిగిన పోలీసులు ఆందోళనకారులను కట్టడి చేశారు. మహిళలు అని కూడా చూడకుండా పోలీసులు లాఠీలతో కొడుతూ, బలవంతంగా పోలీస్ వాహనాల్లోకి ఎక్కించి అదుపులోకి తీసుకోవడంతో బాధితులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సదరు ప్రాంతంలో పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.

Follow Us On: X(Twitter) 
మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>