కలం, కరీంనగర్: గ్రీన్ ఇండియా చాలెంజ్ లో భాగంగా బీఆర్ఎస్ నేత, మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ (Putta Madhukar) మనుమడు దేవ్యాన్ బాబుతో మొక్క నాటించారు. తాతయ్య పుట్ట మధూకర్, నానమ్మ శైలజ, తల్లి కుషాలి సమక్షంలో దేవ్యాన్ బాబు స్వగృహమైన రాజగృహాలో దీపావళి పండుగ సందర్భంగా మొక్క నాటారు. పర్యావరణ పరిరక్షణ, పచ్చదనం పెంపొందించడమే లక్ష్యంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా రాజ్యసభ మాజీ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు ఇచ్చిన పిలుపులో భాగం పుట్ట దంపతులు మరో జనరేషన్ ను అడుగు పెట్టించారు.
చిన్నతనంలోనే మొక్కల పెంపకం, ప్రకృతి పరిరక్షణపై అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో కుటుంబ సభ్యులు చిన్నారిని ప్రోత్సహించినట్లు తెలిపారు. నేడు నాటిన చిన్న మొక్క రేపు మహావృక్షంగా ఎదిగి పర్యావరణానికి మేలు చేస్తుందనే గొప్ప సందేశాన్ని ఈ చిన్నారి చేతుల మీదుగా చేసి చూపించారు. ఆనాడు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ హరితహరం పేరుతో మొక్కలు నాటి వన సంపదను పెంచినట్లు తెలిపారు.

