కలం, కరీంనగర్: కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం గద్దపాక (Gaddapaka) గ్రామపంచాయతీ పరిధిలోని 7వ వార్డు మెంబర్ మునిగంటి వేణు ఇటీవల అనారోగ్యంతో మృతి చెందడంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం అలుముకుంది. ఈ దుఃఖ సమయంలో ఆ కుటుంబాన్ని ఆదుకునేందుకు ఆయన చిన్ననాటి మిత్రులు ముందుకు వచ్చారు. 1వ తరగతి నుండి 10వ తరగతి వరకు వేణుతో కలిసి చదువుకున్న సహచర మిత్రులందరూ కలిసి రూ. 51,000/- ఆర్థిక సహాయాన్ని సేకరించి వేణు కుటుంబ సభ్యులకు అందజేశారు.
ఈ సంక్షష్ట సమయంలో తమ కుటుంబాన్ని ఆప్యాయంగా పరామర్శించి, ఆర్థికంగా అండగా నిలిచిన చిన్ననాటి మిత్రులందరికీ మునిగంటి వేణు కుటుంబ సభ్యులు ప్రత్యేక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలిపారు. కష్టకాలంలో స్నేహధర్మాన్ని చాటుకున్న మిత్రుల బృందాన్ని గ్రామస్థులు అభినందించారు.

