ఇల్లు కేటాయించలేదని మహిళ ఆవేదన

​కలం, మధిర: ​రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకంలో అర్హులైన వారికి తీవ్ర అన్యాయం జరుగుతోందని మధిర నియోజకవర్గం దెందుకూరు (Dendukuru) గ్రామానికి చెందిన ఎలిజాల శిరోమణి ఆవేదన వ్యక్తం చేశారు. ఓట్లు వేయించుకుని తమను మోసం చేశారంటూ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఇళ్లల్లో దీపావళి వేడుకల్లో పాల్గొనేందుకు వచ్చిన ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కను కలిసేందుకు ప్రయత్నించగా అడ్డుకున్నారని ఆరోపించారు. తన కుమారుడు గోపీనాథ్‌ను బలవంతంగా ఈడ్చుకెళ్లి ఫోన్లు లాక్కున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

భట్టి విక్రమార్కకే ఓటేసినా..

​ముగ్గురు పిల్లలతో కూలిపోవడానికి సిద్ధంగా ఉన్న శిథిలావస్థ ఇంట్లో అద్దెకు ఉంటున్నానని శిరోమణి ఆవేదన వ్యక్ం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఇందిరమ్మ ఇల్లు వస్తుందనే నమ్మకంతో తమ కుటుంబంలోని పది మంది ఓట్లు భట్టి విక్రమార్కకు వేశామని గుర్తు చేశారు. ఇప్పటికీ అర్హుల జాబితాలో తమ పేరు లేకపోవడం బాధాకరమని వాపోయారు. ​మొదటి విడతలో ఆర్థికంగా బలమైనవారు, వ్యవసాయ భూములు, పక్కా ఇళ్లు ఉన్నవారికే లబ్ధి చేకూరిందని తెలిపారు. నిజమైన నిరుపేదలకు మాత్రం మోసమే మిగిలిందని ఆరోపించారు. ఆందోళనలు, నిరాహార దీక్షలు చేసినా సమస్య పరిష్కారం కాలేదన్నారు. రెండో విడత జాబితాలోనూ తమకు నిరాశే ఎదురైందని తెలిపారు. ​

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>