epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

జెలెన్​ స్కీకి పుతిన్ క్రిస్మస్​ కానుక…​

కలం, వెబ్​డెస్క్​: అసలే రెండేళ్లుగా ఎడతెగని యుద్ధం.. ఆపై ఒకరి మీద మరొకరు కత్తులు దూసుకోవడం.. ఒకరి అంతాన్ని మరొకరు కోరుకోవడం.. ఇలాంటి పరిస్థితుల్లో ఉక్రెయిన్​ అధ్యక్షుడు జెలెన్​ స్కీకి (Zelensky) రష్యా అధ్యక్షుడు పుతిన్​ కానుక (Putin Christmas gifts) పంపడం ఏంటి అనుకుంటున్నారా? నిజమే.. పంపించారు. జెలెన్​ స్కీకి మాత్రమే కాదు, అమెరికా, చైనా, ఉత్తర కొరియా, వెనెజువెలా అధ్యక్షులకు భారత ప్రధాని మోదీకి (PM Modi) కూడా పుతిన్​ కానుకలు పంపారు! కాకపోతే నేరుగా కాదు ఏఐ వీడియో ద్వారా పంపారు. క్రిస్మస్​ సందర్భంగా కెన్యాలోని రష్యా ఎంబసీ తన ‘ఎక్స్​’ ఖాతాలో ఓ ఏఐ వీడియో పోస్ట్​ చేసింది. ఇందులో శాంటాక్లాజ్​ వేషంలో ఉన్న పుతిన్​ కానుకలు ఇస్తున్నట్లు చిత్రీకరించారు. ఈ వీడియోను పోస్ట్​ చేసి, ‘క్రిస్మస్​ సీజన్​ అంటే గిఫ్ట్​లు ఇచ్చిపుచ్చుకునే సమయం. రష్యా తన స్నేహితులందరికీ బహుమతులు పంపింది. చేసే పనులను బట్టి ఈ కానుకలు ఉంటాయి.’ అంటూ పరోక్షంగా జెలెన్​ స్కీని ఉద్దేశించి రష్యన్​ ఎంబీసీ ట్వీట్​ రాసింది.

ఇంతకీ ఈ వీడియోలో పుతిన్.. ఏమేం కానుకలు (Putin Christmas gifts) ఇచ్చారంటే.. మొదట చైనా అధ్యక్షుడు షీ జిన్​పింగ్​కు రష్యా, చైనా కరెన్సీ ఉన్న గిఫ్ట్ ఇచ్చారు​. డాలర్ ప్రభావం తగ్గుతోందని పరోక్షంగా ఇలా చెప్పినట్లు భావిస్తున్నారు. ఇక, ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్​కు కత్తి, వెనెజువెలా అధ్యక్షుడు నికోలస్​ మదురోకు డీజే సెట్ ఇచ్చినట్లు ఉంది. భారత ప్రధాని నరేంద్ర మోదీకి యుద్ధ విమానాలు ఇచ్చారు. ఇటీవల అత్యాధునిక ఎస్​‌‌–500 క్షిపణి వ్యవస్థను భారత్​కు ఇచ్చేందుకు డీల్​ కుదిరిన విషయం తెలిసిందే. దీనికి సింబాలిక్​గా వీడియోలో చూపించారు. ఇక చివరగా జెలెన్​ స్కీకి ‘సంకెళ్లు’ ఉన్న గిఫ్ట్​ను పంపించినట్లు చూపించారు.

Read Also: కేసీఆర్ అసెంబ్లీకి రావడంలో గొప్పేముంది : ఎన్. రామచందర్ రావు

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>