Mobile Popup Ad
Mobile Popup Ad

ఖమ్మం వెలుగుమెట్ల బాధితుల పక్షాన ఆందోళన.. జాగృతి అధ్యక్షురాలు కవిత అరెస్ట్

కలం, ఖమ్మం బ్యూరో: ఖమ్మం అంబేద్కర్ భవన్‌లో వెలుగుమట్ల బాధితులను తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత (Kavitha) సోమవారం పరామర్శించారు. అనంతరం వెలుగుమట్ల (Velugumatla) బాధితులతో కలిసి కలెక్టరేట్‌కు ర్యాలీగా వెళ్తూ జెడ్పీ సెంటర్‌లోని అంబేద్కర్ విగ్రహం వద్ద బైఠాయించి ఆందోళన చేపట్టారు.

ఖమ్మం(Khammam) జెడ్పీ సెంటర్ లో ఆందోళన చేస్తున్న వెలుగుమట్ల బాధితులను పోలీసులు అరెస్ట్ చేసే క్రమంలో తోపులాట జరిగింది. ఈ తోపులాటలో పలువురు బాధితులకు గాయాలు కాగా కొందరు సొమ్మసిల్లి పడిపోవడం జరిగింది. అరెస్టు అయిన బాధితులను వెంటనే విడుదల చేయాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు.

ఖమ్మం (Khammam) జెడ్పీ సెంటర్‌లో ఆందోళన చేస్తున్న తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితతో ఖమ్మం ఆర్డీవో చర్చలు జరపడం జరిగింది. కలెక్టర్ వచ్చి వెలుగుమట్ల బాధితులకు అదే స్థలంలో ఇంటి పట్టాలు, ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని హామీ ఇచ్చే వరకు ఆందోళన విరమించేది లేదని కవిత స్పష్టం చేశారు. ఈ నేపధ్యంలో కవితను సైతం పోలీసులు అరెస్ట్ చేశారు. కవితతో పాటు ధర్మ సమాజ్ పార్టీ అధ్యక్షుడు విశారదన్ మహరాజ్‌ (Visharadhan Maharaj) ను పోలీసులు అరెస్ట్ చేశారు. మహిళా కానిస్టేబుళ్లు లేకుండానే కవితతో పాటు పలువురు మహిళలను అరెస్టు చేయడంతో పోలీసుల తీరుపై కవిత (Kavitha) ఆగ్రహం వ్యక్తం చేసారు.

Read Also: ఇరాన్ లో వార్.. ఇక్కడ బేజార్

Follow Us On : WhatsApp

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>