మ‌హంకాళీ అమ్మ‌వారిని ద‌ర్శించుకున్న సీఎం రేవంత్

క‌లం, వెబ్‌డెస్క్‌: సికింద్రాబాద్ ఉజ్జ‌యినీ మ‌హంకాళీ అమ్మ‌వారి బోనాల వేడుక‌లు ఘనంగా జ‌రుగుతున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఆల‌యానికి చేరుకొని అమ్మ‌వారిని ద‌ర్శించుకున్నారు. ఆల‌యంలో ప్ర‌త్యేక పూజ‌లు చేశారు. మంత్రి కొండా సురేఖ అమ్మవారికి బోనం సమర్పించారు. సీఎం వెంట మంత్రులు పొన్నం ప్ర‌భాక‌ర్, సీతక్క, ఎమ్మెల్యే న‌వీన్ యాద‌వ్‌, మాజీ మంత్రి త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్‌ కూడా ఉన్నారు. పొన్నం ప్ర‌భాక‌ర్ ఉద‌య‌మే ప్ర‌భుత్వం త‌ర‌ఫున అమ్మ వారికి బంగారు బోనం, ప‌ట్టు వ‌స్త్రాలు స‌మ‌ర్పించారు. మ‌రో వైపు పీసీసీ చీఫ్ మ‌హేశ్ కుమార్ గౌడ్ కూడా అమ్మవారిని ద‌ర్శించుకున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>