Mobile Popup Ad
Mobile Popup Ad

పోలియో రహిత సమాజమే లక్ష్యం.. నిర్మల్‌లో పల్స్ పోలియో డ్రైవ్ ప్రారంభం

కలం, నిర్మల్: పోలియో రహిత సమాజమే లక్ష్యమని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ రాజేందర్ అన్నారు. నిర్మల్ (Nirmal) జిల్లా వ్యాప్తంగా ‘పల్స్ పోలియో’ (Pulse Polio) కార్యక్రమాన్ని ఆదివారం ప్రారంభించారు. నిర్మల్ పట్టణంలోని నాయుడువాడ కాలనీలో బీజేపీ కౌన్సిలర్ సాదం స్వప్న అరవింద్ పిల్లలకు పోలియో చుక్కలు వేశారు.

పోలియో రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ పాటుపడాలనే ఉద్దేశంతో ప్రభుత్వం జాతీయ పల్స్ పోలియో కార్యక్రమాన్ని నిర్వహిస్తుందని తెలిపారు. పోలియో వ్యాధిని పూర్తిగా నిర్మూలించాలంటే ఐదేళ్లలోపు పిల్లలందరికీ తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని తల్లిదండ్రులకు సూచించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు, ఆశా వర్కర్లు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>